హారికతో అందుకే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశా!

బిగ్ బాస్ సీజన్ 4లో ముందుగా అభిజిత్-మోనాల్-అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా హైలైట్ అయింది. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో వీరి ముగ్గురినే ఎక్కువగా చూపించేవారు. అయితే కొన్ని కారణాల వలన అభిజిత్.. మోనాల్ కి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. దీంతో అఖిల్-మోనాల్ లను హైలైట్ చేసి చూపించేవారు. ఇదే సమయంలో అభిజిత్.. హారికకి క్లోజ్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్నట్లుగా చూపించారు. ఇద్దరూ ఎక్కువ సమయం కలిసి గడపడం, హగ్ చేసుకోవడం వంటి విషయాలను ఎక్కువగా చూపించేవారు.

దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. దీనికి తగ్గట్లుగానే అభిజిత్ తల్లి ఓ ఇంటర్వ్యూలో హారిక లాంటి కోడలు కావాలని చెప్పడంతో అందరూ ఫిక్స్ అయిపోయారు. అభిజిత్-హరికల పేర్లను కలిపేస్తూ అభిక అనే ఫ్యాన్ పేజీలు కూడా క్రియేట్ చేశారు. అయితే ఇదంతా తప్పని.. బిగ్ బాస్ తమ రిలేషన్ ని వేరేలా చూపించారని చెబుతున్నాడు అభిజిత్. తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిజిత్.. హారిక తనకు చెల్లెలు లాంటిదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తనకు ఒక తమ్ముడు ఉన్నాడని.. హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని.. అందుకే ఆమెతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని హౌస్ లో హారికకు ఎన్నో సార్లు చెప్పానని.. కానీ అది బయటకి రాలేదనే విషయం ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.