బిగ్ బాస్ 4: బిగ్ బాస్ కి హారిక చాలా ప్రత్యేకం..!

బిగ్ బాస్ హౌస్ లో అంతిమఘట్టం నడుస్తోంది. హౌస్ మేట్స్ జెర్నీలని వాళ్లకి గార్డెన్ ఏరియానాలో చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఫస్ట్ అఖిల్ – అభిజిత్ ఇద్దరి జెర్నీలు అయిన తర్వాత హారిక వంతు వచ్చింది. ఇక అల్లరిపిల్లగా హారిక చేసిన జెర్నీని చూపించాడు బిగ్ బాస్.

హారిక గురించి మాట్లాడుతూ.. ఎన్నో విషయాలని చెప్పాడు. హారిక హౌస్ లో ఇంతవరకూ ఎలా నడుచుకుందో, తోటి హౌస్ మేట్స్ తో ఎలా ప్రవర్తించిందో చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. మీ బిగ్ బాస్ జెర్నీలో మీకు పూలదారులు లభించలేదని, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయని వాటిని పట్టుదలతో ఇంకా మొండితనంతో ఎదుర్కున్నారని చెప్పాడు బిగ్ బాస్. ఎన్ని మేఘాలు కమ్మేయడానికి ప్రయత్నించినప్పటికీ మీరు వాటన్నింటిని సూర్యకాంతిలా ఛేదించుకుంటూ, సిల్వర్ లైనింగ్ లా నిలిచారు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వ్యాఖ్యాన్ని నిజం చేస్తూ ఇక్కడి వరకూ వచ్చి పైనలిస్ట్ గా నిలిచారని చెప్పాడు బిగ్ బాస్.

ఇక జెర్నీలో హైలెట్స్ చూపిస్తున్నప్పుడు హారిక ఇప్పటి వరకూ ఆడిన గేమ్ ని హైలెట్ చేశారు. అంతేకాదు, అభిజిత్ తో ఫ్రెండ్షిప్, టాస్క్ లు ఆడిన పద్దతి, గేమ్ లో ఉన్న లాయల్టీ అనేది క్లియర్ గా కనిపించింది. ప్రతి టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి కెప్టెన్సీ రేసులో ఎన్నోసార్లు పోటీ పడింది. జెర్నీ చూస్తున్నంతసేపు బిగ్ బాస్ హౌస్ లో తను ఏం చేయాలని వచ్చిందో అది ఖచ్చితంగా చేసిందనే అనిపించింది. ఇక ఇక్కడి వరకూ రావడం అనేది తనకి చాలా సంతృప్తినిచ్చిందని, నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఓటు వేసిన ప్రతి ఒక్కరిగి ధన్యవాదాలు తెలుపుకుంది హారిక. బిగ్ బాస్ చెప్పినట్లుగానే ఛోటో ప్యాకెట్ బడా ధమాకాగా మారింది. అదీ విషయం

Share.