బిగ్ బాస్ సీజన్ – 5 ఫ్రెష్ గా ఉండబోతోందట..!

బిగ్ బాస్ సీజన్ 5 సరికొత్తగా ముస్తాబవుతోంది. ఆగష్టు నెలాఖరులో ఈ షోని స్టార్ట్ చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలతో కలిసి కాంట్రాక్ట్ రాస్కున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈసారి ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, సింగర్స్, కొరియోగ్రాఫర్స్ తో పాటుగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సెలబ్రిటీలని, టిక్ టాక్ ఫేమ్ భామలని తీస్కోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. లాస్ట్ టైమ్ ఎంటర్ టైన్మెంట్ నెవర్ బిఫోర్ అంటూ సీజన్ 4 రక్తికట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ ఫైవ్.. ఎప్పుడూ లేని విధంగా మరింత కొత్తగా ఉండబోతోందని అంటున్నారు.

ఈసారి సెట్ ని హైదరాబాద్ లో కాకుండా వేరే చోట వేయాలని ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. కానీ, అలాంటిది ఏమీ లేదని న్యూస్ తెలుస్తోంది. ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ ని వేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ని మరింత రిచ్ గా నిర్మించబోతున్నారని అంటున్నారు. ఈసారి సెలబ్రిటీలు సైతం హౌస్ మేట్స్ ని పలకరించేందుకు హౌస్ లోకి వచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. దీనికోసం గెస్ట్ రూమ్ ని కూడా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చిన గెస్ట్ లు ఒకటి రెండురోజులు పార్టిసిపెంట్స్ తో ఉండి, టాస్క్ లు ఆడి మరీ వెళ్తారని టాక్.

అంతేకాదు, సంచాలక్ గా ఉంటూ కంటెస్టెంట్స్ ని గైడ్ చేస్తారట. ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ చకచకా తీస్కుంటున్నా నేపథ్యంలో బిగ్బాస్ స్టార్ట్ అయ్యేనాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది కాబట్టి, మరింత కొత్తగా దీన్ని డిజైన్ చేయబోతున్నారు. ఇక మరోసారి యాంకర్ గా నాగార్జునే సీజన్ 5ని హోస్ట్ చేయబోతున్నారు. ఈ సీజన్ లో కూడా గత సీజన్ లో లాగానే క్యాష్ ప్రైజ్ ని ఇస్తారని, అయితే, ఓటింగ్ సిస్టమ్ లో కొన్ని మార్పులు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Share.