బంపర్ ఆఫర్ కొట్టేసిన దేత్తడి భామ!

యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న భామ దేత్తడి హారిక. తెలంగాణా యాసతో, తన పంచ్ డైలాగ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న హారిక టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు సంపాదించుకుంది. కష్టమైన టాస్క్ లను కూడా అవలీలగా చేసేసి బాగా పాపులర్ అయింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమెని తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హారిక పాల్గొంది. తనకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తకి కృతజ్ఞతలు చెప్పింది. తనకు ఇచ్చిన బాధ్యతలను నూటికి నూరు శాతం నెరవేరుస్తానని చెప్పింది. అనంతరం చైర్మన్ శ్రీనివాస్ గుప్త తెరాస ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా చేనేత రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.