బిగ్ బాస్ ఫేమ్ ను అమ్మడు బాగానే క్యాచ్ చేసుకొంటోంది

బిగ్ బాస్ అనే మాయా ప్రపంచంలోకి వెళ్ళి బయటకు వచ్చాక తర్వాత ఏం చేయాలి అనేది చాలామందికి అగమ్యగోచరం. వచ్చిన ఫేమ్ ను ఎలా వాడుకోవాలో తెలియక, ఏం చేస్తే ఏమవుతుందో అనే టెన్షన్ లో ఉండగానే బిగ్ బాస్ కొత్త సీజన్ కూడా మొదలైపోతుంది. మునుపటి మూడు సీజన్ల కంటెస్టంట్స్ విషయంలో అదే జరిగింది. అయితే.. సీజన్ 4 పార్టీసీపెంట్స్ & ఫైనలిస్ట్స్ మాత్రం బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ & స్టార్ స్టేటస్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.

ఆల్రెడీ సొహైల్ హీరోగా సినిమా లాంచ్ అవ్వనుంది.ఇప్పుడు మరో ఫైనలిస్ట్ అరియానా గ్లోరీ కూడా మెల్లమెల్లగా బిగ్ బాస్ ఫేమ్ ను వినియోగించుకొని సినిమా ఆఫర్లు దక్కించుకోంటోంది. కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో అరియానాను సిస్టర్ రోల్ కోసం ఫైనల్ చేశారు. షూటింగ్ కూడా మొదలైంది. అప్పటివరకూ యాంకరింగ్ చేస్తూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దక్కని సినిమా ఆఫర్లు ఇప్పుడు తనను వెతుక్కుంటూ వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది అరియానా.

ఇదికాకుండా రాజ్ తరుణ్ – శ్రీనివాస్ గవిరెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ అరియానా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందట. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని చెబుతోంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ ఈ అవకాశాలు సరిగా వినియోగించుకొని నటిగా బిజీ అవుతుందో లేదో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.