బిగ్ బాస్ 4: అభిజీత్ పై ట్రోలింగ్స్..!

బిగ్ బాస్ సీజన్ – 4 విన్నర్ అభిజీత్ అని డిక్లేర్ అయ్యిపోయింది. అభిజీత్ ఫ్యాన్స్ అందరూ సంబరాలు మొదలుపెట్టేశారు. ఇలా షూటింగ్ అయ్యిందో లేదో అలా క్షణాల్లో ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకూ హోరాహోరీగా ఈసీజన్ ఎంతో ఆసక్తిగా సాగింది. ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీని అభిజీత్ అందుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. రోబో టాస్క్ తోనే ప్రజల హృదయాలని గెలిచిన అభిజీత్ ఆ తర్వాత తన బిహేవియర్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. చాలామంది టాస్క్ లు ఆడట్లేదని ట్రోల్ చేసినా కూడా క్రేజ్ ఎక్కడా కూడా అభిజీత్ కి తగ్గలేదు.

మోనాల్ తో క్లాషెష్ వచ్చినా, అఖిల్ తో విభేదాలు వచ్చినా, సోహైల్ తో గొడవ అయినా, హారికతో అలిగినా, అమ్మరాజశేఖర్ తో వ్యతిరేకించినా, నోయల్ తో ఫ్రెండ్షిప్ అయినా ఇలా అందరితోనూ అభిజీత్ కి హౌస్ లో బ్యూటిఫుల్ జెర్నీ ఉందనే చెప్పాలి. చాలామంది సోఫాలో ఉత్తగా కూర్చుని మరీ టైటిల్ తీస్కున్నాడని ట్రోల్స్ కూడా చేశారు. కానీ, బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసేటపుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, తోటివారితో ఎలా ఉంటున్నాం అనేది కూడా లెక్కలోకి వస్తుంది. అంతేకాదు, అభిజీత్ ఎప్పుడూ కూడా ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించింది కానీ, టాస్క్ లలో ఎగ్రెసివ్ గా దూసుకుపోయి ఆడింది కానీ లేదు. ఎదుటి వారికి కావాల్సినంత స్పేస్ ఇస్తూనే తన గేమ్ ని తాను ప్లాన్ చేస్కుని ఆడాడు. అందుకే ఇప్పుడు విన్నర్ అయ్యాడు.

రెండుమూడుసార్లు నాగార్జునతో క్లాస్ పడిన తర్వాత పూర్తిగా సెట్ అయిపోయాడు. ఫస్ట్ లో హౌస్ మేట్స్ తో వచ్చిన విభేదాలని పరిష్కరించుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత తనకి ఇచ్చిన టాస్క్ లలో న్యాయం చేశాడు. ప్రతి టాస్క్ లో తనవంతు పార్టిసిపేషన్ ని చూపించాడు. ఎంతమంది ఎన్నివిధాలుగా కిందకి లాగుదాం అని చూసినా కూడా చెక్కుచెదరకుండా తన గేమ్ ప్లాన్ ని వర్కౌట్ చేసి విన్నర్ గా నిలిచాడు. తన గేమ్ తోనే బయట ప్రేక్షకులని ఆకర్షించాడు. హ్యూజ్ ఓటింగ్ తో విజయం సాధించాడు.

Share.