బిగ్ బాస్ 4: టాప్ – 2 లోకి వచ్చేది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ని సోషల్ మీడియాలో డిసైడ్ చేసేస్తున్నారు. అన్ అఫీషియల్ సైట్స్ లో అభిజీత్ కి వస్తున్న హ్యూజ్ ఓటింగ్ ని షేర్ చేస్తూ విన్నర్ అభిజిత్ అంటూ పోస్టర్స్ షేర్ చేస్తున్నారు. ఈ టైమ్ లో అసలు టాప్ – 5 ప్లేస్ లలో ఎవరు ఉంటారు. అభిజీత్ తో పోటీపడే ఆ టాప్ – 2 కంటెస్టెంట్ ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అభిజిత్ గెస్సింగ్ వర్క్ ప్రకారం టాప్ – 2 హారిక ఉంటే మాత్రం అప్పుడు అభిజిత్ అన్న మాటలు నిజమవుతాయా అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం అనధికార వెబ్ పోలింగ్స్ ని చూస్తే అభిజీత్ టాప్ ప్లేస్ లో ఉంటే సోహైల్ సెకండ్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. ఆ తర్వాత హారిక, అరియానా, అఖిల్ కి దాదాపుగా ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఓటింగ్ అనేది కేవలం వెబ్ సైట్స్ లో మాత్రమే పడుతుందని, వాటిని నమ్మొద్దని , ఫేక్ ఓటింగ్ వేసేవారు కూడా ఉంటున్నారని, మ్యానుప్లేట్ చేసే వెబ్ సైట్స్ కూడా ఉంటాయని బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే, ఓటింగ్ ని డిసైడ్ చేసేది కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో మాత్రమే అని, అంతేకాకుండా మిస్డ్ కాల్ డేటా ఆధారంగా కూడా టాప్ – 5 ప్లేస్ లు ఉంటాయని అంటున్నారు. ఇక ఓటింగ్ కి ఇంకా రెండురోజులు టైమ్ ఉందని, ఈ రెండు రోజుల్లో ఏదైనా జరగచ్చని కూడా చెప్తున్నారు చాలామంది. ఏది ఏమైనా ఈసారి టాప్ – 2 లో అభిజీత్ అలాగే హారికలు వస్తే మాత్రం ఆకిక్ వేరేగా ఉంటుందని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అదీ విషయం.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.