బిగ్ బాస్ 4: మెగాస్టార్ చిరు చేతుల మీదుగా ట్రోఫీ..!

బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. లాస్ట్ వరకూ జరిగిన హై డ్రామాలో టాప్ – 5 కంటెస్టెంట్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు విన్నర్ అవుతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఫినాలే ఎపిసోడ్ లో మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ కి ట్రోఫీని అందించారు.

చివరి వరకూ ఉన్న అఖిల్ అండ్ అభిజీత్ ఇద్దరిలో అభిజీత్ ని విన్నర్ ని చేసేసరికి అభిజీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోఫాలో కూర్చుని కూల్ గా చిల్ అవుతూ మైండ్ గేమ్ ఆడుతావ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి అబిజీత్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు, అభిజీత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూశాను అని, అందులో నీ క్యారెక్టర్ ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని మెగాస్టార్ చెప్పండతో అభిజీత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక నాగార్జున కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ అభిజీత్ ని విన్నర్ చేసేసరికి మిగతా హౌస్ మేట్స్ అందరూ కేరింతలు కొట్టారు. అభిజిత్ వాళ్ల మదర్ మాట్లాడుతూ అఖిల్ అండ్ అభిజీత్ ఇద్దరూ కూడా మీలాగా అవ్వాలని వాళ్లని ఆశీర్వదించమని చెప్పింది. అంతేకాదు, ఇక్కడ ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా విన్నరే అని అనడంతో చప్పట్లతో స్టూడిమో మార్మోగిపోయింది.

Share.