బిగ్ బాస్ 4: 11 సెంటిమెంట్ విన్నర్ ని చేస్తుందా..?

బిగ్ బాస్ సీజన్ 4 చివరకి వచ్చేసింది. ఇక అభిజీతే విన్నర్ అంటూ డిసైడ్ చేస్తూ నెటిజన్స్ పోస్టర్స్ ని షేర్ చేస్తున్నారు. ఓటింగ్ లో రాకెట్ లా దూసుకువెళ్తున్నాడు అంటూ అన్ అఫీషియల్ పోల్స్ ని సైత్ చూపిస్తున్నారు. అంతేకాదు, 11 నెంబర్ సెంటిమెంట్ గా చూసినా కూడా అభిజీతే విన్నర్ అని అంటున్నారు.

అరియానా, హారిక‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్ ప్రస్తుతం టైటిల్ పోరులో ఓటింగ్ లో సత్తా చాటుతున్నా కూడా అభిజీత్ పేరులోనే జీత్ ఉందని చెప్పేస్తున్నారు ఆడియన్స్. అంతేకాదు, 11 నెంబర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని జోస్యం చెప్తున్నారు. ఈ సీజన్ లో అభిజీత్ 11 సార్లు నామినేట్ అయ్యాడు.

అలాగే, సీజన్ 2 లో కూడా విన్నర్ అయిన కౌషల్ 11సార్లు నామినేట్ అయ్యాడు. ఇక సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మనోడే విన్నర్ అంటూ ప్రచారం మొదలైంది.

డిసెంబర్ 20వ తేదిన జరగబోయే గ్రాండ్ ఫినాలేలో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని, అభిజీత్ విన్నర్ గా నిలుస్తాడని అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు అభిజీత్ తో పోటీపడే ఆ రన్నరప్ ఎవరా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.