బిగ్ బాస్ 4: నీ నిర్ణయంలో క్లారిటీ ఉంది..!

బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ వచ్చి మంచి ఫన్ చేశారు. వర్చువల్ గా హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ సందడి చేశారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్స్ హిందీ బిగ్ బాస్ షోలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలిమినేషన్ అయి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ తిరిగి ఇలా వర్చువల్ గా వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల హౌస్ మేట్స్ కి మంచి ఎనర్జీ అనేది వస్తుంది. అయితే, ఈసారి తెలుగులో మాత్రం సీజన్ చివరకి వచ్చేసరికి ఈ ప్రయోగం అనేది చేశారు.

మాజీ కంటెస్టెంట్స్ తో టాప్ 5 పార్టిసిపెంట్స్ చేసిన ఫన్ అదిరిందనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీముఖి బాగా అల్లరి చేసింది. హరితేజ, గీతామాధురి అఖిల్ కి పులిహోర సైటర్స్ వేశారు. అలాగే హౌస్ లో ఉన్నవాళ్లు కూడా ఇప్పుడున్న ఫీలింగ్స్ ని వాళ్లతో షేర్ చేసుకున్నారు. అలీరైజా అయితే, మీరు ఈ సీజన్ 4 లో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశారని, సీజన్ సీజన్ కి షో టాప్ లోకి వెళ్తోందని చెప్పాడు.

గీతామాధురి అయితే, నామినేషన్స్ అప్పుడు అయితే మాకు చాలా టెన్షన్ వచ్చేదని చెప్పింది. అంతేకాదు, ఇక్కడే హరితేజ హారికని పొగిడింది. చోటు చోటు అంటారు కానీ, నువ్వు టాస్క్ లు ఆడే పద్దతి కానీ, స్టాండ్ తీస్కునే విధానం కానీ, ఎంతో ఇన్స్ పైయిరింగ్ గా అనిపిస్తుందని చెప్పింది. అంతేకాదు, నీ డెసీషన్ మేకింగ్, క్లారిటీ నిజంగా చాలా బాగుంటుందని చెప్పింది. ఆ తర్వాత హారిక కోసం బిగ్ బాస్ ని స్పెషల్ సాంగ్ వేయమని శ్రీముఖి కోరింది. దీంతో హారిక సూపర్బ్ గా డ్యాన్స్ వేసింది. అందరూ కూడా ఫన్ చేశారు.

ఇక అభిజీత్ విషయానికి వస్తే, నీకు లేడీస్ ఫాలోయింగ్ బాగా ఉందని, అమ్మాయిలకోసం ఒక పాట పాడమని అడిగితే అభిజీత్ పాట పాడాడు. నీ ఎదలో నాకు చోటు వద్దు.. అంటూ అభిజీత్ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక మాజీలు చేసిన ఫన్ కి హౌస్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.