బిగ్ బాస్ 4: టాప్ – 5 ఎలిమినేషన్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ టాప్ – 5 లో నిలిచిన కంటెస్టెంట్స్ ఫినాలే రోజున ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోతారు. చివరకి మిగిలేది ఇద్దరే ఆ ఇద్దరిలోనే విజేతని నిర్ణయిస్తారు. లాస్ట్ సీజన్ లో కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఫైనల్స్ రోజున ఇలాగే జరిగింది. అయితే, టాప్ – 5 లిస్ట్ ఎవరి ప్లేస్ ఏంటి అనేది ఈసారి మాత్రం చాలా ఉత్కంఠంగా మారింది. ఓటింగ్ రిజల్డ్స్ అనేవి మనకి ఎక్కడా కూడా చూపించరు. కేవలం వెబ్ సైట్స్ లో పోలింగ్ అయిన ఓటింగ్ ప్రకారమే ఇది ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న అన్ అఫీషియల్ ఓటింగ్ ని బట్టీ చూస్తే , అభిజీత్ టాప్ – 1 ప్లేస్ లో ఉన్నాడు. అతడే విన్నర్ అని కన్ఫార్మ్ గా కూడా చాలామంది చెప్పేస్తున్నారు. అయితే, సండేజోరు ఫైనల్స్ లో ఇది ఎనౌన్స్ చేస్తేనే అందరికీ విన్నర్ అని డిసైడ్ అవుతుంది. అయితే, ఇక్కడే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అనేది చాలా ఆసక్తిగా మారింది.

టాప్ – 2 లో సోహైల్ ఉండాటా.. లేదా అరియానా ఉంటుందా లేదా హారిక , అఖిల్ లు ఉంటారా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం సోహైల్ కే ఈ ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ టీమ్ ఓట్ల ప్రకారం చేస్తారా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. లాస్ట్ సీజన్స్ లో చూసినట్లయితే ఓటింగ్ ప్రకారం మాత్రం జరగలేదనే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.

సీజన్ – 2 లో కౌషల్ తర్వాత దీప్తి అన్ అఫీషియల్ వెబ్ సైట్స్ లలో సెకండ్ ప్లేస్ లో ఉంటే అనూహ్యంగా గీతామాధురి రన్నరప్ గా నిలిచింది. అప్పుడు అఫీషియల్ ఓటింగ్ కి , సైట్స్ లో ఓటింగ్ కి చాలా తేడా ఉందని తెలిసింది. ఆ తర్వాత సీజన్ 3 లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మరి ఏ బేస్ పైన ఎలిమినేషన్ ప్రోసెస్ చేస్తారు అనేది చాలా ఆసక్తిగా మారింది. మరి చూద్దాం.. చివరకి నిలిచేది ఎవరు..? ట్రోఫీ గెలిచేది ఎవరు అనేది..?

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

Share.