బిగ్ బాస్ 4: హౌస్ మేట్స్ చెప్పిన రీజన్స్ ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం అసలు సిసలైన గేమ్ మజా అనేది వచ్చింది. ముసుగులో ఇంతవరకూ గేమ్ ఆడింది ఎవరు..? మీ ముసుగు తొలగించింది ఎవరు ? అనేది అందరూ కూడా చిన్న చిన్న రీజన్స్ అనేది చెప్పారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యేందుకు మీకు ఎందుకు అర్హత ఉంది..? అర్హత లేని వాళ్లు ఎవరో చెప్పమని అడిగినపుడు , హౌస్ లో ముగ్గురు అరియానాకి ఓటు వేయడం అనేది విశేషం.

ఇప్పటి వరకూ టాస్క్ ల్లో చాలా ఓవర్ గా ఆడిందని, కాస్త శృతిమించి ఆడినట్లుగానే అనిపించిందని, కేవలం గేమ్ కోసమే ఇలా ఆడటం వల్ల టైటిల్ గెలవడానికి అర్హత లేదు అని హౌస్ మేట్స్ చెప్పారు. ఇందులో ఫస్ట్ అఖిల్ తన గురించి తాను మాట్లాడుతూ , ఇప్పటి వరకూ ఏదైనా కూడా నేను ఇండివెడ్యువల్ గా పోరాడాను అని , నా హార్ట్ మైండ్ తోనే గేమ్ ఆడాను అని అన్నాడు. అందుకే నాకు అర్హత ఉంది అని, ఇక అరియానాకి విజేత అయ్యే అర్హత లేదని చెప్పాడు. తను టాస్క్ లలో బియాండ్ ద టాస్క్ చాలాసార్లు బిహేవ్ చేసిందని, అంత అవసరం లేకపోయినా సరే ఆడిందని చెప్పాడు.

సేమ్ టు సేమ్ ఇలాగే సోహైల్ కూడా అరియానా గురించి చెప్తూ, టాస్క్ లలో తాను శృతిమించి ఆడిందని అందుకే డిసర్వ్ కాదని చెప్పాడు. ఇక హారిక కూడా 5శాతం ఎక్కడో నాకు నీకు అర్హత లేదనిపిస్తోందని చెప్పింది. అంతేకాదు, నీవల్ల టాస్క్ లో నేను ఎక్కడో ఒకచోట ట్రబుల్ అయ్యాను అని, అంతేకాదు వేరేవాళ్లు కూడా నామినేషన్స్ లో ఇదే రీజన్ చెప్పారని చెప్పి గుర్తుచేసింది. అందుకే నేను నిన్న అనర్హురాలిగా అన్ డిసర్వ్ క్యాండెట్ గా చెప్తున్నానని చెప్పింది హారిక.

దీన్ని ప్రొటక్ట్ చేసుకుంటూ అరియానా కూడా ఆటలో వేరు, గొడవలో వేరు, గేమ్ లో వేరు అంటూ మాట్లాడింది. ఆటలో స్ట్రిక్ట్ గా ఉన్నాను అంటే గేమ్ బాగా ఆడినట్లే అర్ధం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన దృష్టిలో హారికని తిరిగి టైటిల్ విన్నర్ అవ్వడానికి అనర్హురాలిగా ప్రకటించింది. అదీ విషయం.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.