‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ల ఊపు మామూలుగా లేదు..!

కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ‘బిగ్ బాస్4’ ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. బడ్జెట్ సమస్యల వల్ల ఈసారి ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ లు చాలా తక్కువ మందే ఉన్నారు. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ కు మాత్రం.. వాళ్ళు తక్కువ చెయ్యలేదు. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చారు. చెప్పాలంటే మొదటి మూడు సీజన్ల కంటెస్టెంట్లు కంటే.. వీళ్ళే ఎక్కువ ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అంతేకాదు షో ముగిసాక వీళ్లకు ఆఫర్లు కూడా ఓ రేంజ్లో వస్తుండడం విశేషం.

కొందరు సినిమాల్లో, మరి కొంతమంది బుల్లితెర పై వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో మోనాల్ ఐటెం సాంగ్ చేస్తుంది. ఇక దివికి అలాగే మెహబూబ్ కు మెగాస్టార్ నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు దక్కాయని తెలుస్తుంది. ఇక సోహెల్ కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. అఖిల్ కు కూడా కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసే ఆఫర్స్ లభిస్తున్నాయట.

అభిజీత్ కు దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి అవకాశమివ్వబోతున్నాడని టాక్. ఇక అరియనా-అవినాష్ లతో ఓ ప్రముఖ ఛానల్ వారు రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారట. దేత్తడి హారిక, లాస్య వంటి వారికి కూడా మంచి అవకాశాలే వస్తున్నాయని వినికిడి. ఏమైనా ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ లు మొత్తం బిజీ బిజీగా మారిపోయినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.