సినిమాలు వదిలెయ్యమన్నాడు.. అందుకే అతన్నే వదిలేసాను : దివి విద్య

‘బిగ్ బాస్4’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో దివి అనే అమ్మాయి కుర్రాళ్ళ మతిపోగొడుతున్న సంగతి తెలిసిందే. హౌస్లో సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూపోతున్న ఈ బ్యూటీ గురించి మొదట్లో పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ తరువాత ఈమె మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించింది అని తెలియగానే.. ఒక్కసారిగా ఈమె పై అందరి దృష్టి పడింది. ఆ చిత్రంలో మహేష్ బాబుతో ఫ్లర్ట్ చేయించుకునే సన్నివేశాల్లో దివి కనిపించింది. ఇక ఈమె ఒక మోడల్ కూడా..! ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడంతో దివి పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే..

అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది! ఇదిలా ఉండగా.. ఇంత సైలెంట్ గా ఉండే దివికి ఒక బ్రేకప్ లవ్ స్టోరీ కూడా ఉందని కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దివి మాట్లాడుతూ.. “గతంలో నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాం..తరువాత బ్రేకప్ అయ్యాము. ఇప్పుడైతే నేను ఎటువంటి రిలేషన్ షిప్‌లో లేను. సింగిల్‌గా ఉండటమే బాగుంది. అదే బెటర్ అని కూడా ఫిక్సయ్యాను. సింగిల్‌గా ఉంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు.. హ్యాపీగా ఉండొచ్చు. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్ గానే ఉన్నాను.. కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడటం వల్ల బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది.

Bigg Boss 4 Telugu Contestant Divi Love Story1

అతని ఫ్యామిలీలో చిన్న ఇష్యూ వచ్చి పడింది. ఇప్పటికీ అతని పై నాకు మంచి అభిప్రాయమే ఉంది. నిజంగా అతను చాలా మంచి వ్యక్తి. ఆ అబ్బాయి.. తమ్ముడు దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దాంతో అతని ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ టైములో తనతో పాటు వాళ్ల పల్లెటూరికి రమ్మని నన్ను అడిగాడు. కానీ నేను వెళ్లలేదు. నేను చిన్నప్పటి నుండీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు నాకు అలవాటు లేదు. అయినా అతని కోసం వెళ్లేదాన్నేమో..! కానీ నాకు ఇష్టమైన మోడలింగ్.. ఇంకా సినిమాలు వదిలేయమని అతను నాతో చెప్పాడు.అది నాకు ఇష్టం లేదు. అందుకే అతన్నే వదిలేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Share.