బిగ్‌బాస్ బ‌జ్ : రాహుల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్న లాస్య‌..!

బిగ్‌బాస్ హౌస్ నుండి లాస్య ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ అంటేనే ట్విస్టులు.. స్నేహితులు శ‌త్రువులుగా, శత్రువులు స్నేహితులుగా ఎప్పుడు మార‌తారో ఎవ‌రూ చెప్ప‌లేదు. నామినేష‌న్ ప్ర‌క్రియ టైమ్‌లో అయితే కంటెస్టెంట్లు మ‌ధ్య ఓ చిన్న‌పాటి వారే న‌డుస్తోంది. ఇక ఎలిమినేష‌న్ ట్విస్టులు అయితే మామూలుగా ఉండ‌వు. ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌నుకుంటే, ఊహించ‌ని విధంగా బ్యాగులు స‌ర్ధుకుని మ‌రోక‌రు హౌస్ నుండి మ‌రొక‌రు బ‌య‌ట‌కు వెళ్ళిపోతారు. అయితే ప‌ద‌కొండో వారంలో మాత్రం ముందుగా అంద‌రూ ఊహించిన కంటెస్టెంటే ఎలిమినేట్ అవ‌డంతో ఈసారి బిగ్‌బాస్‌కే పెద్ద షాక్ త‌గిలింది.

మెయిన్ స్ట్రీమ్ మీడియ‌లోనూ, సోష‌ల్ మీడియాలోనూ లాస్య ఎలిమినేట్ అవుతుందని వార్త‌లు జోరుగా చ‌క్క‌ర్లు కొట్టాయి. అనుకున్నట్లే ఆదివారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె జ‌ర్నీ ముగిసింది. ఎలిమినేష‌న్ త‌ర్వాత స్టేజ్‌పై మాట్లాడుతూ సోహైల్‌, అభిజిత్‌లు టాప్ 2లో ఉంటార‌ని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఇక అంత‌కంటే పెద్ద షాకింగ్ విష‌యం ఏంటంటే.. తాజాగా బిగ్‌బాస్ బ‌జ్ ప్రోగ్రాం ఇంట‌ర్వ్యూలో భాగంగా హోస్ట్ రాహుల్ మైండ్‌బ్లాక్ చేసింది. కంటెస్టెంట్ల నుండి స్మూత్‌గా స‌మాధానాలు రాబ‌ట్టే రాహుల్ ప‌ప్పులు లాస్య ముందు ఉడ‌క‌లేదు. హౌస్‌లో ఎవ‌రి గురించి అడిగినా, సేఫ్‌గా స‌మాధానాలు చెప్పి రాహుల్‌కు ఫస్ట్రేష‌న్ తెప్పించింది. మ‌ధ్య‌లో రాహుల్‌నే రివ‌ర్స్‌లో ప్ర‌శ్నిస్తూ.. హోస్ట్ ఎవ‌రు గెస్ట్ ఎవ‌రు అనేలా రాహుల్‌ను ఓ ఆట ఆడుకుంది లాస్య‌.

హౌస్‌లో కంటెస్టెంట్ల గురించి పాజిటివ్‌గా చెబుతుందో నెగిటీవ్‌గా చెబుతుందో అర్ధంకాక రాహుల్ త‌ల ప‌ట్టుకున్నాడు. ఇక అఖిల్ – మోనాల్ రిలేష‌న్ మ్యాట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు అయితే సేఫ్‌గా ఆన్స‌ర్స్ చెబుతూ రాహుల్‌ను మ‌రోసారి క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసింది. వాళ్ళే గొడ‌వ‌లు ప‌డ‌తారు.. కొట్టుకుంటారు, మ‌ళ్ళీ క‌లిసిపోతారు.. మ‌నం చూసేవాళ్ళం ఓ అంటూ పాజ్ ఇవ్వ‌గా, హౌలాగాళ్ళం అంటూ లాస్య ఇస్తున్న సేఫ్ ఆన్స‌ర్స్‌కు రాహుల్ ఫ‌స్ట్రేష‌న్ పీక్స్‌కు వెళ్ళిపోయింది. దీంతో ప్ర‌తిసారి కంటెస్టెంట్ల‌ను త‌న ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బంది పెట్టే రాహుల్‌ను లాస్య ఓ రేంజ్‌లో ఆడేసుకుంది.


మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.