అయ్యబాబోయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద పరీక్షే..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం వల్ల రాంచరణ్ ఫ్యాన్స్ ను ఎలా ఉన్నా కానీ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనానికి మాత్రం దర్శకుడు రాజమౌళి పెద్ద పరీక్షే పెడుతూ వస్తున్నాడు. 2018 అక్టోబర్ లో వచ్చిన ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్ నుండీ మరో సినిమా రాలేదు. 2019 లో సినిమా లేదు, 2020 లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ఉండదని ఎప్పుడో తేలిపోయింది. 2021 జనవరి 8న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతుంది అని ప్రకటించాడు కానీ… లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది కాబట్టి అది కూడా కష్టమేనని ఇటీవల నిర్మాత దానయ్య చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. చరణ్ పుట్టినరోజున అల్లూరి పాత్రకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేసాడు రాజమౌళి. కాబట్టి ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా ఓ వీడియోని విడుదల చేస్తాడు అని అంతా భావించారు. కానీ లాక్ డౌన్ వల్ల బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల ఎటువంటి వీడియో విడుదల చేయలేకపోతున్నాం అని ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు.అతి త్వరలో ఎన్టీఆర్ వీడియోని విడుదల చేస్తాం అని కూడా ఫ్యాన్స్ ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.

No teaser for NTR birthday from RRR movie1

పోనిలే త్వరలో ఎన్టీఆర్ వీడియో చూడొచ్చు అనుకుని సర్దుకుపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు.. ఇప్పుడు ఆగష్టు 15 వరకూ ఎదురుచూపు తప్పదని ఇన్సైడ్ టాక్. ఇప్పట్లో మంచి సందరభం లేదు కాబట్టి.. స్వాతంత్ర దినోత్సవం రోజునే ఎన్టీఆర్ వీడియోని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అన్ని రోజులంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చెయ్యగలుగుతారా అనేది పెద్ద డౌట్..!

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.