‘ఎస్.వి.సి’ బ్యానర్ నుండీ అతను అవుట్..!

దిల్ రాజు.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నాడు ఈయన. కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్ గా కూడా అతను ఎన్నో హిట్లు అందుకున్నాడు. దిల్ రాజు జడ్జిమెంట్ పై ప్రేక్షకులు ఎంతో నమ్మకం ఉంది. అతను డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలను కూడా ప్రివ్యూ చూసి.. అందులో మార్పులు కూడా చెబుతుంటాడనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉండగా దిల్ రాజు తో పాటు ఇప్పటివరకూ శిరీష్ – లక్ష్మణ్ లు కూడా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుంటారు.

Big Shock To Dil Raju1

వీరిలో లక్ష్మణ్ ఇప్పుడు బయటకి వచ్చేస్తున్నాడనేది తాజా వార్త. గత కొంత కాలంగా దిల్ రాజు, లక్ష్మణ్ ల మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పుడు లక్ష్మణ్ ఓ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నాడట. ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు ఈయనకి మద్దతు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారట. అంతేకాదు లక్ష్మణ్ కొడుకు ప్రస్తుతం చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడట. మరి లక్ష్మణ్ నిర్మాతగా ఎంత వరకూ సక్సెస్ అవుతాడో తెలీదు కానీ.. ఈయన సెపరేట్ అవ్వడం వల్ల దిల్ రాజుకి పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.