ఊపందుకోని కలెక్షన్స్.. ఇలా అయితే ఫ్లాపే

అదేంటి అలా జరగడానికి వీల్లేదు అని మీరు ఎంత నేత్తీనోరు కొట్టుకున్నా.. మీరు చదివింది నిజమే. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లోనూ “గ్యాంగ్ లీడర్” ఆశించిన స్థాయి కలెక్షన్స్ సాధించకపోవడమే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ, ఎగ్జిబిటర్స్ కి కానీ లాభాలు కాదు కదా కనీసం పెట్టిన ఎమౌంట్ కూడా తెచ్చిపెట్టలేకపోయింది. నిజానికి సినిమాకి వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ మరియు రివ్యూల బట్టి “గ్యాంగ్ లీడర్” కనీసం యావరేజ్ హిట్ గా అయినా నిలుస్తుంది అనుకొన్నారు జనాలు.

first-look-of-nanis-gangleader-raises-curiosity

సినిమా బిజినెస్ 28 కోట్ల వరకు అవ్వగా.. ఇప్పటివరకూ ఏ ఒక్క ఏరియాలోనూ పెట్టిన ఎమౌంట్స్ రీఫండ్ అవ్వలేదు. ప్రారంభ వసూళ్ల విషయంలో నాని మునుపటి చిత్రమైన ‘దేవదాస్”ను కూడా క్రాస్ చేయలేకపోయింది “గ్యాంగ్ లీడర్”. దాంతో సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా సినిమా ఫ్లాపయ్యిందని తెగ బాధపడిపోతున్నారు నాని & టీం. ఇక ఈవారం “వాల్మీకి” విడుదలవుతుండడంతో.. ఈ శుక్రవారం నుంచి మాస్ జనాలు “గ్యాంగ్ లీడర్” వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. దాంతో “గ్యాంగ్ లీడర్”కి హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ రిజల్ట్ మాత్రం తప్పలేదు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.