మెగా మేనల్లుడు సినిమాకి పెద్ద సమస్య వచ్చి పడిందే..!

మెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్ కొద్దిగా గాడిలో పడింది. మొన్నటి వరకూ అరడజను ప్లాపులు ఫేస్ చేసిన ఈ మెగా హీరో… ఎట్టకేలకు ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నాడు. ఇక తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను కూడా హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.

‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలానే మిగిలున్నాయి. అందులోనూ ఈ చిత్రం రన్ 2 గంటల 40 నిముషాలు పైనే వచ్చిందని తెలుస్తుంది. ఇది పెద్ద సమస్యే అని చెప్పాలి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు తో కలిసి సహా నిర్మాత సుకుమార్ కూడా రష్ చూసి ట్రిమ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తుంది.

Big problem for Uppena movie1

అది మరికొన్ని రోజులు పడుతుందని తెలుస్తుంది. అటు తరువాత ఆర్.ఆర్ పనులు మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో.. ఈ చిత్రం పై అంచనాలు భారీగానే పెరిగాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో తెరక్కిన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.