వెంకీ ముందున్న అసలు ఛాలెంజ్ అదే..!

వెంకటేష్ అతిపెద్ద ప్రయోగానికి తెరదీశారు. నారప్ప అనే ఓ వయసు మళ్ళిన పల్లెటూరి రైతుగా వెండి తెరపై నట విశ్వరూపం చూపనున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ చిత్ర టైటిల్ తో కూడిన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. తమిళ మాతృకలో నటించిన ధనుష్ గెటప్ కి చాలా దగ్గిరగా తెలుగు చిత్రం నారప్ప లో వెంకటేష్ లుక్ ఉంది. ఐతే వెంకటేష్ కెరీర్ బిగినింగ్ నుండి పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్ చేసింది లేదు. ఎప్పుడో ఓ చిత్రంలో వెంకటేష్ చాలా భాగం లుంగీలో కనిపిస్తారు. అంతకు మించి ఇలాంటి కల్ట్ డీ గ్లామర్ రోల్ చేసిన దాఖలాలు లేవు.

Venkatesh in and as Naarappa1

కెరీర్ లో మొదటిసారి నారప్ప చిత్రంతో ఆయన భారీ ఛాలెంజ్ ని నెత్తిన వేసుకున్నారు. నిజంగానే వెంకటేష్ అతిపెద్ద ఛాలెంజ్ కే పూనుకున్నాడు. వయసుకొచ్చిన ఇద్దరు కొడుకులు కలిగి ఓ వెనుకబడిన వర్గానికి చెందిన రైతు పాత్ర ఆయన చేస్తున్నారు. తమిళంలో ఈ పాత్ర చేసిన ధనుష్ నటన ఆకాశం అంత ఎత్తులో ఉంది. పిల్లల దృష్టి లో చేతగాని తాగుబోతు తండ్రిగా ధనుష్ అవార్డు విన్నింగ్ కనబరిచాడు. నడక, ఆహార్యం, మాట తీరు, రౌద్రం… ఇలా ప్రతి కోణంలో ఆ పాత్రకు ధనుష్ వంద శాతం పరిపూర్ణత ఇచ్చారు. దీనితో ఆ పాత్రను ఎంచుకున్న వెంకటేష్ పై అందరి దృష్టి పడింది. ఆయన ధనుష్ ని మరిపించగలడా అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇక సినిమా విడుదల తర్వాత, పోలికలు మొదలైపోతాయి. ఏమాత్రం వెంకటేష్ నటన ధనుష్ సెట్ చేసిన మార్కును చేరుకోలేకపోయినా, తీవ్ర విమర్శల పాలు కావలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెంకటేష్ ముందున్న అసలైన ఛాలెంజ్ అదే.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.