నితిన్ కు హిట్టు పడేలా ఉందిగా..!

‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి డిజాస్టర్ల తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన చిత్రం ‘భీష్మ’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి.. ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహాతి సాగర్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

Bheeshma Theatrical Trailer Review1

‘దుర్యోధన, దుశ్శాసన, ధర్మరాజ్, యమ ధర్మరాజ్, శని,శకుని .. ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లుండగా.. పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు! దాని వల్లనేమో ఒక్కరు కూడా పడట్లేదు నాకు’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. మంచి కామెడీతో యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకునేలానే కట్ చేశారు. ‘అశ్వద్ధామ’ విలన్ జీషు సేన్ గుప్తా ఈ చిత్రంలో కూడా విలన్. నితిన్, రష్మిక పెయిర్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ‘భీష్మ’ లో చిత్రంలో మిక్స్ చేసినట్టు ఉన్నాడు దర్శకుడు వెంకీ. ట్రైలర్ చూస్తుంటే నితిన్ కు ఓ మంచి హిట్ పడేలానే ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.