‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో సినిమాని ప్రమోట్ చేసిన బ్రహ్మాజీ..!

నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఇటీవల యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విచ్చేసాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన బ్రహ్మాజీ ని స్టేజి పైకి ఆహ్వానించింది యాంకర్ సుమ. అయితే స్టేజి పై అతని ప్రవర్తనకు ‘భీష్మ’ నిర్మాతలు మండిపడ్డారని తెలుస్తుంది.

Brahmaji at Bheeshma movie pre release event (1)

విషయం ఏమిటంటే.. బ్రహ్మాజీ కొడుకు హీరోగా ‘ఓ పిట్టకథ’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైక్ పట్టుకోవడమే ‘ ‘ఓ పిట్టకథ’ చిత్రం మార్చి 6న విడుదల కాబోతుంది’ అని అన్నాడు. వెంటనే అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఇది గమనించిన బ్రహ్మాజీ ‘ఓ ఇది భీష్మ కథ. ఈ మధ్యన ఆ చిత్రానికి ప్రమోషన్ చేసి చేసి అలవాటు అయిపొయింది’ అంటూ కవర్ చేసాడు. దీంతో ఈవెంట్ ముగిసాక నిర్మాతలు బ్రహ్మాజీ పై ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ‘నువ్వు నీ కొడుకు సినిమాకి ప్రమోషన్ చేసుకోవాలి అని అనుకోవడంలో తప్పు లేదు.. ‘భీష్మ’ గురించి మాట్లాడటం అయిపోయాక ఓ నిమిషం ఆ సినిమా గురించి కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మాకు ఓ చెప్పాలి’ అంటూ వారు మందలించినట్టు తెలుస్తుంది.

1

Brahmaji at Bheeshma movie pre release event (2)

2

Brahmaji at Bheeshma movie pre release event (3)

3

Brahmaji at Bheeshma movie pre release event (4)

4

Brahmaji at Bheeshma movie pre release event (5)

5

Brahmaji at Bheeshma movie pre release event (6)

6

Brahmaji at Bheeshma movie pre release event (7)

7

Brahmaji at Bheeshma movie pre release event (8)

8

Brahmaji at Bheeshma movie pre release event (9)

9

Brahmaji at Bheeshma movie pre release event (10)

10

Brahmaji at Bheeshma movie pre release event (11)

11

Brahmaji at Bheeshma movie pre release event (12)

Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.