Bheemla Nayak: ఆ హీరోకు షాకిచ్చిన భీమ్లా నాయక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ అయినప్పటికీ ఈ మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. భీమ్లా నాయక్ పవన్ స్ట్రెయిట్ సినిమాలను మించి రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ వ్యూస్ తో పాటు లైక్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది.

భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కు 24 గంటల్లోనే ఏకంగా 8.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆల్ ఇండియాలో ఈ రికార్డును సొంతం చేసుకున్న మూవీ భీమ్లా నాయక్ మాత్రమే కావడం గమనార్హం. ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ లుక్ ఆకట్టుకోవడంతో పాటు పవన్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులకు సైతం భీమ్లా నాయక్ టీజర్ నచ్చడం గమనార్హం. అయితే అజిత్ హీరోగా నటించిన వాలిమై టీజర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు.

అటు భీమ్లా నాయక్ ఇటు వాలిమై వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజవుతున్నాయి. వాలిమై సినిమా టీజర్ 24 గంటల్లో కేవలం 6.8 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించింది. 2021 సంక్రాంతి సమయంలో సైతం భీమ్లా నాయక్ సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ కు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్నారు. భీమ్లా నాయక్ క్రియేట్ చేసిన రికార్డులకు ఇప్పట్లో ఢోకా లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.