ఇలా కూడా బెల్లంకొండ సినిమా సక్సెస్ సాధించింది..!

‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఏ స్టార్ హీరో కొడుకు కూడా ఈ రేంజ్లో ఎంట్రీ ఇచ్చి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ చిత్రం క్రెడిట్ అంతా దర్శకుడు వినాయక్ కే దక్కింది. నటుడిగా బెల్లంకొండ ప్రూవ్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు ఆ లోటుని ‘రాక్షసుడు’ చిత్రం తీర్చింది. దాదాపు 5 ప్లాపుల తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంతో మరో హిట్ కూడా అందుకున్నాడంట.

rakshasudu-movie-review5

అదేంటి అదే సినిమాతో మళ్ళీ హిట్ అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి ఈ చిత్రాన్ని ఇటీవల జెమినీ టీవీలో టెలికాస్ట్ చేయగా ఎవ్వరూ ఊహించని విధంగా 10.1 టి.ఆర్.పి వచ్చిందట. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు 6కోట్లకు కొనుగోలు చేశారట. అయితే 10.1 రేటింగ్ తో చాలా వరకూ రికవరీ అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఇప్పుడు మరోసారి గనుక ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తే వారు లాభాలు బాట పట్టే అవకాశం పుష్కలంగా ఉందని తెలుస్తుంది. ఇలా బుల్లితెర పై కూడా బెల్లంకొండ సినిమా హిట్టయ్యిందన్నమాట.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.