‘బంగారు బుల్లోడు’ టీజర్ రివ్యూ..!

‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో అల్లరి నరేష్ హీరోగా పి.వి.గిరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. నిజానికి ఈ చిత్రాన్ని 3 ఏళ్ళ క్రితమే మొదలు పెట్టారు. కానీ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా కారణంగా ఈ చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయిందట. ‘మహర్షి’ చిత్రంలో అల్లరి నరేష్ గడ్డంతో కనిపించాల్సి ఉంది. ఆ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం అల్లరి నరేష్ పాత్రే కీలకంగా ఉంటుంది కాబట్టి.. తప్పలేదు.

ఇక ‘మహర్షి’ చిత్రం రిలీజ్ అయ్యి ఏడాది దాటినా.. ఇంకా ‘బంగారు బుల్లోడు’ పూర్తికాకపోవడం గమనార్హం. త్వరలో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. ఇక నాలుగైదు ‘జబర్దస్త్’ పంచ్ లు లాంటి డైలాగులు తప్ప టీజర్ లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. అయితే ‘హీరో తండ్రి అమ్మవారి నగలు దొంగిలించి వాటితో వ్యాపారం మొదలు పెడతాడు. ఆ పాపానికి గాను అతని కుటుంబానికి శాపం తగులుతుంది.

Bangaru Bullodu Movie Teaser Review1

హీరో తండ్రి కుటుంబంలో ఎవ్వరికీ పెళ్లిళ్లు కాకపోవడమే ఆ శాపం అని తెలుస్తుంది. మరి చివరికి హీరో పెళ్ళైనా జరుగుతుందా? చివరికి హీరో కుటుంబం తిరిగి ఆ నగల్ని అమ్మవారికి అలంకరించేసి ఆ శాపాన్ని తొలగించుకున్నారా?’ అనేదే అసలు కథ అని తెలుస్తుంది. కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ టేకింగ్ మాత్రం రొటీన్ లా అనిపిస్తుంది. ఏమైతేనేం.. నరేష్ ఉన్నాడుగా.. టీజర్ ను ఓ లుక్కెయ్యండి.


మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Share.