సరిలేరు నీకెవ్వరులో మహేష్ ను డామినేట్ చేయనున్న బండ్ల

నిర్మాతగా మారిన తర్వాత వెండితెరకు దూరమైన బండ్ల గణేష్ బుల్లితెరపై కామెడీ పండించి వీరలెవల్లో ఎంటర్ టైన్ చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం కంటే.. బండ్ల గణేష్ పీక కోసుకుంటాడా లేదా అనే విషయం మీదనే జనాలు ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు బండ్ల ఏరేంజ్ లో జనాలను ఎంటర్ టైన్ చేశాడు అనేది.

bandla-ganesh-in-sarileru-neekevvaru-movie

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్ ఈ చిత్రంలో “బ్లేడ్ గణేష్”గా కనిపించనున్నాడు. బండ్ల క్యారెక్టర్ ను అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాశాడట. మహేష్ బాబు & బండ్ల కాంబినేషన్ కామెడీ జనాలని కడుపుబ్బ నవ్విస్తుందని వినికిడి. జనాలు ఈ కామెడీని ఎంజాయ్ చేయాలంటే సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ బండ్ల మళ్ళీ కమెడియన్ గా హిట్ అయ్యాడంటే.. ప్రెజంట్ జనరేషన్ లో ఒక సీనియర్ కమెడియన్ లేని లోటు తీర్చేస్తాడు.

Share.