సినీ పెద్దలు స్పందించరా.. బండ్ల కామెంట్స్ వైరల్..?

కమెడియన్ గా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ వకీల్ సాబ్ మూవీకి ఏపీలో అన్యాయం జరుగుతుండటంపై స్పందించడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందు, రిలీజ్ తరువాత పవన్ ఫ్యాన్స్ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు హిట్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒక కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులకు న్యాయం చేసే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించారు.

అయితే ఏపీలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది. గతంలో పెద్ద హీరోల సినిమాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాకు అనుమతులు ఇవ్వకపోవడంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని కొన్ని ఏరియాల్లో వైల్డ్ డాగ్ టికెట్ రేటు 150 రూపాయలుగా ఉంటే వకీల్ సాబ్ టికెట్ రేటు 110 రూపాయలుగా ఉండటం గమనార్హం. “వకీల్ సాబ్.. ఏపీ ప్రభుత్వ పనితీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా..?” అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

వకీల్ సాబ్ తో ఆపేస్తారా..? అంటూ మరో పోస్ట్ కూడా పెట్టి ఏపీ ప్రభుత్వంపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. వకీల్ సాబ్ సినిమాకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరైనా ట్వీట్లు చేస్తే బండ్ల గణేష్ ఆ ట్వీట్లను రీ ట్వీట్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమా విషయంలో వ్యవహరించిన విధంగానే రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోయే సినిమాల విషయంలో వ్యవహరిస్తుందేమో చూడాల్సి ఉంది.


Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.