నమ్రతా శిరోద్కర్ ను వెనకేసుకొస్తున్న నిర్మాత బండ్ల గణేష్..!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు.. రకరకాల యూటర్న్ లు తీసుకుని.. ఇప్పుడు డ్రగ్స్ కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అతని ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ వాడినట్టు గుర్తించిన ఎన్.సి.బి( నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఆమెను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ అయిన జయ సాహాను కూడా ఎన్.సి.బి విచారించింది.ఈ నేపథ్యంలో జయ సాహాతో డ్రగ్స్ కోసం ఛాటింగ్ చేసిన వారి లిస్ట్ లో మన టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు కూడా ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీని పై ఎన్.సి.బి అధికారులు కానీ పోలీసులు కానీ ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ నేషనల్ మీడియా మాత్రం నమ్రత పేరుని ఓ రేంజ్లో ప్రచారం చేస్తుంది. దాంతో నిన్నటి నుండీ నమ్రత పేరు పెద్ద ఎత్తున మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్ అభిమానులు కూడా నేషనల్ మీడియా పై మండిపడుతున్నారు.

Namrata Whatsapp Chatting Screenshot Became Viral in Social Media1

ఈ క్రమంలో బండ్ల గణేష్ ఇన్వాల్వ్ అయ్యి నమ్రత శిరోద్కర్ కు మద్దతు పలకడం చర్చనీయాంశం అయ్యింది. ‘‘ఆమె నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. ఆమె ఒక గొప్ప భార్య, ఒక గొప్ప తల్లి. నమ్రతా అంటే నాకెంతో గౌరవం’’ అంటూ బండ్ల గణేష్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.అయితే డ్రగ్స్ వ్యవహారం గురించి మాత్రం ప్రస్తావించకుండా నమ్రత గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు బండ్లన్న.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.