‘రూలర్’ ట్రైలర్ రివ్యూ… అభిమానుల్ని సైతం బాద పెట్టేలా..!

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రంగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జై సింహా’ చిత్రం మంచి హిట్ అయ్యింది కాబట్టి ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి కూడా చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతో ప్రమోషన్లు మొదలు పెట్టిన ఈ చిత్రం యూనిట్ సభ్యులు తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

Balakrishna's Ruler Teaser Review

‘ధర్మ.. మా ఊరికే గ్రామ దైవం.. ఎవరికి ఏం కష్టం వచ్చినా.. తనే ముందుంటాడు..’ అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది. బాలయ్య వీర యాక్షన్ మోడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ‘ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీసానో బయటికి వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే’ అంటూ ఎప్పుడూ వినే రొటీన్ డైలాగ్ తో నరికే ఎపిసోడ్స్.. విలన్ లను గాల్లోకి ఎగరేసే ఎపిసోడ్స్ తో టీజర్ నింపేసాడు దర్శకుడు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లతో పాటు నటి భూమిక, సహజ నటి జయసుధ కూడా దర్శనమిచ్చింది. ఈ చిత్రానికి బాలయ్యతో ‘అధినాయకుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పరుచూరి మురళి కథను అందించడం విశేషం. ‘ఐరన్ మెన్’ లా కనిపించిన ఒక్క బాలయ్య లుక్ తీసేస్తే మిగిలిన లుక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. టీజర్ అయితే బాలయ్య గత చిత్రాల్లానే ఉంది. ట్రోల్ చేసే వారికీ అయితే ఈ టీజర్ మంచి ఫీస్ట్ ఏమో కానీ… బాలయ్య అభిమానుల్ని కూడా ఈ టీజర్ బాధపెట్టే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.