డిసెంబర్ పోటీలోకి దూకుతున్న దేవరకొండ బాబు

ఒక యువ కథానాయకుడిగా ఎంతటి స్టార్ డమ్ అందుకున్నా.. ఎంత పాపులారిటీ సాధించినా ఇంకా అగ్ర కథానాయకులతో పోటీ పడే స్థాయికి మాత్రం చేరుకోలేదనేది ఎవ్వరూ కాదు అనలేని నిజం. కానీ.. ఈసారి విజయ్ ఆ రిస్కే చేస్తానంటున్నాడు. నిజానికి.. విజయ్ దేవరకొండ తాజా చిత్రమైన “వరల్డ్ ఫేమస్ లవర్” ఫిబ్రవరి 4, 2020 విడుదలవ్వాలి. కానీ.. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైపోయి ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలై ఉండడంతో.. ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడట దేవరకొండ బాబు.

Balakrishna with Vijay Devarakonda

ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ “ప్రతిరోజూ పండగే”, బాలకృష్ణ “రూలర్” చిత్రాలు డిసెంబర్ స్లాట్ ను బుక్ చేసుకొన్నాయి. అలాగే రవితేజ డిస్కో రాజా కూడా డిసెంబర్ విడుదల అని ఎనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటికీ.. ఎందుకో అది వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ పోటీలోకి విజయ్ దేవరకొండ అడుగిడుతుండడంతో.. లెక్కలు మారే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ పోటీ ఎలాంటి ఇష్యూస్ కి దారి తీస్తుందో చూడాలి.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.