ఆయన కొట్టడం, వీళ్ళు కవర్ చేయడం, ఏమిటో ఈ పనులు

విడుదలైన ప్రతి సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ అని పోస్టర్ రావడం ఎంత కామానో.. ఏదైనా సినిమాకి సంబంధించి పబ్లిక్ మీట్ లో లేదా రాజకీయపరమైన ప్రచారాల్లో బాలయ్య ఎవరో ఒకర్ని కొట్టడం కూడా అంతే కామన్. వెర్రి వేషాలు వేసే అభిమానుల్ని కొట్టడం అంటే ఒకే కానీ మరీ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చే వారిని కొట్టడం, పక్కకు వచ్చి నిల్చున్నాడని తన్నడం, బూతులు తిట్టడం అనేది బాలయ్య అభిమానులు ఎంత సపోర్ట్ చేసుకున్నా హర్షించదగిన అంశమైతే కాదు. సపోర్ట్ చేసుకోవడం వరకు ఒకే కానీ..

బాలయ్య కొడితే “మా హీరో మా చెంప ముట్టుకున్నాడు” అని మురిసిపోవడం అనేది విపరీతం. అప్పట్లో “పైసా వసూల్” ప్రమోషన్స్ టైంలో పూరి ఒక ఇంటర్వ్యూలో బాలయ్య ఎందుకు కొడతాడు అనే అంశంపై ఇచ్చిన వివరణ అందరూ నవ్వుకునేలా చేసింది. ఇవాళ టీడీపీ కార్యకర్తలు బాలయ్య కొట్టిన ఓ ఫోటోగ్రాఫర్ చేత రికార్డ్ చేయించి రిలీజ్ చేసిన వీడియో కూడా అదే తరహాలో ఉంది. ఇవాళ ఉదయం పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా ప్రచారానికి బాలయ్య ఓ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఓ ఫోటోగ్రాఫర్ మీద చేయి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలెట్టింది.

దీన్ని కవర్ చేయడం కోసం బాలకృష్ణ & టీమ్ ఆ ఫోటోగ్రాఫర్ చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఆ వీడియోలో ఆ అబ్బాయి ఎదురుగా ఉన్న పేపర్ చదువుతున్నాడు అని స్పష్టంగా అర్ధమైపోతుంది. ఈ విషయమై ఎలాంటి కవరింగ్ చేయకుండా వదిలేసినా “బాలయ్యకు ఇది మామూలే” అని జనాలు కూడా లైట్ తీసుకొనేవారు. కానీ.. పనిగట్టుకొని రిలీజ్ చేయించిన వీడియో చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి కవరింగండీ అని వాపోతున్నారు. సో బాలయ్య గారు, ఇక నుంచి మీరు కొట్టినా పర్లేదు కానీ.. ఇలాంటి బలవంతపు వీడియోలు మాత్రం చేయించకండి!

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.