పాపం మెహ్రీన్.. ఆఫర్లు లేవు..!

కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లు సాధించి మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ మెహ్రీన్ కౌర్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ వంటి హిట్లు అందుకుంది. దీంతో ఈమెకు ఇక తిరుగులేదు అనుకున్నారు. కానీ సడెన్ గా ఈమెకు ప్లాప్ లు మొదలయ్యాయి. ‘కేర్ ఆఫ్ సూర్య’ ‘జవాన్’ ‘పంతం’ ‘నోటా’ ‘కవచం’ వంటి వరుస ప్లాప్ లు ఎదురయ్యాయి. అలాంటి టైములో ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఫుల్ ఫామ్లోకి వస్తుంది అనుకుంటే.. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనేలా ఉంది.

Back To Back Flops For Mehreen Pirzada1

ఆ తరువాత మళ్ళీ ‘చాణక్య’ తో ప్లాప్ అందుకుంది. సరే ఈ సంక్రాంతికి హిట్లు కొడుతుందేమో అనుకుంటే.. అదేం జరగలేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎంతమంచి వాడవురా’ చిత్రం ప్లాప్ అయ్యింది. కలెక్షన్లు పర్వాలేదనిపించినా.. హిట్ గా నిలివలేకపోయింది. ఇక ఇటీవల విడుదలైన ‘అశ్వథ్థామ’ చిత్రం పర్వాలేదనిపించినా.. ఈ అమ్మడికి పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. అసలు ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదని టాక్. మరి ఈమె పరిస్థితి ఏంటో..!

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Share.