గుర్రపు స్వారీ బాలయ్యాలా ఎవరూ చేయలేరు.. చిరంజీవి కూడా: బాబు మోహన్

మన జనరేషన్ హీరోల్లో గుర్రపు స్వారీ చేయడంలో రామ్ చరణ్ తోపు అనే విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పట్నుంచి గుర్రపు స్వారీ అలవాటు ఉండడంతో.. సినిమాల్లో సదరు సన్నివేశాల్లో రామ్ చరణ్ చూపించిన ఈజ్ మరే హీరో చూపించలేకపోయాడు. అయితే.. మన మునుపటి జనరేషన్ లో గుర్రపు స్వారీలో చిరంజీవి తోపు అనుకొంటుంటారు. కానీ.. గుర్రపు స్వారీలో బాలయ్య ముందు చిరంజీవి కూడా దిగదుడుపే అని కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు పాపులర్ స్టార్ కమెడియన్ బాబు మోహన్.

Babu Mohan about Chiranjeevi And Balakrishna

రీసెంట్ గా ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. “అసలు బాలయ్య గుర్రం మామూలుగా తొలడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం గుర్రం జూలు పట్టుకొని స్వారీ చేసేస్తుంటాడు. గుర్రపు స్వారీ విషయంలో బాలయ్యతో చిరంజీవి కూడా పోటీ రాడు” అని చెప్పడం సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో బాలయ్య & మెగా ఫ్యాన్స్ అందరు మళ్ళీ మా హీరో తోపు అంటే మా హీరో తోపు అని గొడవపడడం మొదలెట్టారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.