బిగ్ బాస్4: సినిమా టాస్క్ లో ప్రస్టేషన్..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరికి కోపం వస్తుంది.. ఎవరిపై విరుచుపడతారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా ఈసీజన్ లో అందరూ తమ కోపతాపాలని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఫస్ట్ మూడువారాలు సోహైల్ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. దానికి నాగార్జున బ్రేక్స్ వేసేసరికి ఇప్పుడు తన కోపాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడు. మరోవైపు పదునైన మాటలతో అరియానా రెచ్చిపోతోంది. ఎక్కడిక్కడ లాజిక్స్ వర్కౌట్ చేస్తూ.., అభిజిత్ అండ్ హారికలు జట్టుగా గేమ్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక బిబి బ్లాక్ బస్టర్ సినిమా టాస్క్ జరిగేటపుడు స్క్రిప్ట్ విషయంలో ప్రస్టేట్ అయ్యాడు అవినాష్.

నేను తిండి కూడా తినకుండా టాస్క్ చేస్తుంటే మిగతా వాళ్లు కామెడీ చేస్తున్నారని, సీరియస్ నెస్ అస్సలు ఎవరికీ లేదని రెచ్చిపోయాడు. నిజానికి ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచీ అభిజిత్ చేసే పని అవినాష్ కి నచ్చడం లేదు. తను రాసి స్క్రిప్ట్ ని ఛేంజ్ చేయడం, డైలాగ్స్ ని మార్చమని లాస్ట్ మినిట్ లో చెప్పడం అనేది నచ్చలేదు. అంతేకాదు, తనని తాను ఎక్కువగా హైలెట్ చేస్కుంటున్నారనే నింద వేసేసరికి తట్టుకోలేకపోయాడు అవినాష్ . దీనిపై చాలా సీరియస్ అయ్యాడు. నిద్రపోతున్న నోయల్ కి వచ్చి తన బాధని చెప్పుకున్నాడు. అంతేకాదు , అమ్మరాజశేఖర్ తో మాట్లాడేటపుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇక నామినేషన్స్ లో నా పవర్ చూపిస్తానని, అప్పుడు చెప్తాను ఈ పాయింట్స్ అని కూడా అన్నాడు.

నిజానికి ఇక్కడ అవినాష్ టార్గెట్ చేసింది ఎవర్నీ అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అభిజిత్ తో ఫస్ట్ నుంచి క్లాష్ వచ్చింది కాబట్టి అభిజిత్ ని టార్గెట్ చేసాడనే అంటున్నారు అందరూ. అంతేకాదు, లాస్య మద్యలో టచ్ అప్ అంటూ కామెడీ చేయడం, అఖిల్ – మోనాల్ ఇద్దరూ టాస్క్ ని సీరియస్ గా తీస్కుని ఆడలేదు అని అవినాష్ ఫీల్ అవ్వడం కూడా కారణమే. అంతేకాదు , అక్కడ అరియానా కూడా యాక్షన్ అనగానే నవ్వేసింది. ఇక్కడే అవినాష్ చాలాసేపు ఫీల్ అయ్యాడు. ప్రస్టేట్ అయ్యాడు. మరి ఈసారి నామినేషన్స్ లో వీళ్లలో ఎవర్ని టార్గెట్ చేస్తాడు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.