మెడికల్ మాఫియా పై అశ్వద్ధామ పోరాటం

యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న లేటెస్ట్ మూవీ అశ్వద్ధామ. తన గత చిత్రాలకు భిన్నంగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. కాగా నేడు ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. వైజాగ్ వేదికగా సాగే మెడికల్ మాఫియా గురించి ఈ చిత్రం తెరకెక్కింది అనిపిస్తుంది. యువతుల శరీరాలతో మెడికల్ మాఫియా చేస్తున్న వ్యాపారం ఏమిటీ..? అని తెలుసుకునే యువకుడిగా నాగశౌర్య కనిపిస్తున్నాడు.

Aswathama Movie Trailer

సామాజిక విషయాల పట్ల యాక్టీవ్ గా ఉండే యువకుడు ఓ మాఫియా సామ్రాజ్యం పై ఎలా పోరాటం చేశాడు. చివరికి ఆ మాఫియా ఆట ఎలా కట్టించారు అనే విషయాలు ప్రధానంగా అశ్వద్ధామ చిత్రం తెరకెక్కింది అనిపిస్తుంది. ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ చిత్రంతో ఓ మంచి హిట్ నాగశౌర్య తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాగశౌర్య కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. కండలు పెంచడంతో పాటు, సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమణ తేజ అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. మెహ్రిన్ మొదటి సారి నాగశౌర్య కి జంటగా నటిస్తుంది.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.