‘అశ్వథ్థామ’ అవతారమెత్తిన నాగశౌర్య..!

ఇప్పటి వరకూ లవ్.. ఫ్యామిలీ.. కామెడీ వంటి ఎలిమెంట్స్ తో కూడుకున్న క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య ఈసారి ఫుల్ యాక్షన్ మోడ్ లోకి మారాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. రమణ తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ‘కె.జి.ఎఫ్’ వంటి పాన్ ఇండియా చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన ‘అన్బు ఆరివ్’ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కోపోజ్ చేస్తున్నారు. తాజా ఈ చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ తో కూడుకున్న మోషన్ పోస్టర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.

Aswathama Concept Motion Poster1

‘ప్రతి ఇంట్లో ఒక అశ్వథ్థామ ఉంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కుర్రాడి కథ ఇది. మహాభారతంలో అశ్వథ్థామకు.. మా అశ్వథ్థామకు.. ఎటువంటి సంబంధం ఉండదు’ అని దర్శకుడు ఇదివరకే చెప్పిన రీతిగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. అనగనగా.. ఓ నగరం.. ఆ నగరంలో ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయిలను.. అంబులెన్సు లో ఎత్తుకుపోతున్న ఓ ముఠా. అసలు ఆ వెనుక రహస్యాన్ని చేధించే ఓ కుర్రాడు.. అతనే మన హీరో’ అనే రీతిగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Aswathama Concept Motion Poster2


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.