మరో సారి సంచలన కామెంట్లు చేసిన నటి సాయి సుధ..!

స్టార్ సినిమాటోగ్రఫర్ చోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటాననని చెప్పి మోసం చేసాడని ప్రముఖ సినీ నటి సాయి సుధ గతేడాది ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్యామ్.కె.నాయుడికి ఆల్రెడీ పెళ్లి అయినప్పటికీ.. తన మొదటి భార్యతో తనకు రిలేషన్ సరిగ్గా లేదని చెప్పి.. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఈ నేపథ్యంలో తనని శారీరకంగా కూడా వాడుకున్నాడని సాయి సుధ కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాదు తను సంపాదించుకున్న డబ్బంతా కూడా వాడేసుకున్నాడని..

ఇప్పుడు తనకి ఏ ఆధారం లేదని..ఎలాగైనా తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ మీడియా ముఖంగా విన్నపించుకుంది. ఈ క్రమంలో శ్యామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. కొన్నాళ్ల తరువాత అతను బయటకి వచ్చాడు. సాయి సుధతో రాజీపడుతున్నట్టు కూడా పేపర్లు రెడీ చేసుకున్నాడట . ఈ విషయాన్ని సాయి సుధ వ్యతిరేకించడం కూడా జరిగింది.అవన్నీ నకిలీ ఆధారాలు అంటూ కూడా ఆమె అడ్డం తిరిగింది. ‘గతేడాది ఆగస్టులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరాం తనను మాదాపూర్ పిలిచి,

Actress Sri Sudha opens up about her relationship with Shyam K Naidu1

కేసు రాజీ చేసుకోవాలని బెదిరించి బూతులు తిట్టారని. తన పై శారీరక దాడికి కూడా వారు పాల్పడ్డారని’ తాజాగా పోలీసులకు కంప్లైంట్ చేసింది. శ్యామ్ కె నాయుడు పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఇప్పటికీ తనని బెదిరిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు తనకు శ్యామ్ కె నాయుడు మరియు అతని ఫ్యామిలీ నుండీ ప్రాణహాని ఉన్నట్లు కూడా సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు తెలిపింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.