క్రిష్ డైరెక్షన్లో నెక్స్ట్ సినిమా.. ఆ సంస్థలోనే…?

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’ చిత్రం ఫిబ్రవరి 22 న (రేపు) విడుదల కాబోతుంది. ఎన్నో అసలు పెట్టుకుని చేసిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం క్రిష్ కు చేదు అనుభవాన్ని ఇచ్చింది. దీంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉండగా క్రిష్ చేయ‌బోయే నెక్స్ట్ సినిమా ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మ‌హానాయ‌కుడు’ విడుదలైన తరువాత కొంచెం గ్యాప్ తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్నాడట.

దీని తరువాతే తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెడతాడంట క్రిష్. ‘బాహుబ‌లి’ నిర్మాత‌లైన శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిల‌తో క్రిష్ కు మంచి స్నేహ బంధం ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘వేదం’ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ‘ఆర్కా మీడియా’ సంస్థ నిర్మాణంలో క్రిష్ ఓ చిత్రం చేస్తున్నాడట. అయితే ఈ చిత్రం కంటే ముందే.. క్రిష్ త‌న సొంత బ్యానర్ అయిన ‘ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌’ లో ఓ చిత్రం చేస్తాడట. ఆ త‌ర‌వాతే.. ‘ఆర్కా మీడియా’ సినిమా ఉండ‌బోతోందని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్ళువడనున్నాయని సమాచారం.

Share.