‘అర్జున్ సురవరం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

అనేకసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ ‘అర్జున్ సురవరం’ చిత్రం హిట్ లిస్ట్ లో చేరిపోయింది. నవంబర్ 29న విడుదలయిన ఈ చిత్రం మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు రాబడుతోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించగా… ‘ఠాగూర్’ మధు సమర్పకుడిగా వ్యవహరించాడు. ‘పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

Arjun Suravaram Movie Review5

నైజాం 1.44 cr
సీడెడ్ 0.65 cr
ఉత్తరాంధ్ర 0.76 cr
ఈస్ట్ 0.49 cr
వెస్ట్ 0.38 cr
కృష్ణా 0.50 cr
గుంటూరు 0.64 cr
నెల్లూరు 0.32 cr
ఏపీ + తెలంగాణ 5.18 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.27 cr
ఓవర్సీస్ 0.55 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6 cr (share)

‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారట. ఇక మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్స్ అంతా సేఫ్ జోన్ లోకి ఎంటరైనట్టే. పోటీగా మరే సినిమా లేకపోవడంతో ‘అర్జున్ సురవరం’ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే ఈ వారం ‘ఆర్.ఎక్స్.100′ హీరో కార్తీకేయ నటించిన ’90 ఎం.ఎల్’ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంతమేర కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. మరి ఈ వీకెండ్ ను ‘అర్జున్ సురవరం’ ఎంత వరకూ క్యాష్ చేసుకోకుందో చూడాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.