ప్రభాస్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్

ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు చాలా రెగ్యులర్ గా వర్క్ చేసే ఆయన తెలుగు సినిమాలకి మాత్రం చాలా తక్కువగా పనిచేస్తుంటారు. ఆయన బడ్జెట్ మన తెలుగు నిర్మాతలకు సూట్ అవ్వకపోవడం ఒక సమస్య అయితే.. రెహమాన్ సంగీతం అందించిన ఒక్క సినిమా కూడా తెలుగులో హిట్ అవ్వకపోవడం.. ఆయన స్ట్రయిట్ తెలుగు పాటలకు శ్రోతల నుండి పెద్దగా రెస్పాన్స్ కూడా రాకపోతుండడం మరో కారణం.

అందుకే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు లేదా తమిళ, మలయాళ సంగీత దర్శకులతోనో కాలం నెట్టుకొచ్చేస్తారు కానీ.. రెహమాన్ వద్దకు మాత్రం వెళ్లరు మనోళ్ళు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ “రాధేశ్యామ్” నుండి అజయ్-అతుల్ తప్పుకోవడంతో వారి స్థానంలో రెహమాన్ ను తీసుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవల్ స్టోరీ కాబట్టి రెహమాన్ తన సంగీతంతో న్యాయం చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ప్రభాస్ అభిమానులకు మాత్రం చిన్న డౌట్ పాటలు హిట్ అవుతాయా లేదా?

సినిమా రిజల్ట్ కి రెహమాన్ సెంటిమెంట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అని. ఈ అనుమానాలను పక్కన పెడితే ప్రభాస్ సినిమాకి రెహమాన్ సంగీతం అనేది సినిమా స్థాయిని తప్పకుండా పెంచుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న “రాధేశ్యామ్”కు రెహమాన్ ప్రస్తుతానికి ప్లస్సే!

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Share.