స్వీటీ అకౌంట్లో మరో హిట్ గ్యారంటీ..!

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ‘భాగమతి’ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాధవన్, అంజలి,షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇక నవంబర్ 7న (రేపు) అనుష్క పుట్టినరోజు కావడంతో తాజాగా ‘నిశ్శబ్దం’ టీజర్ ను విడుదల చేశారు.

Anushka's Nishabdham Movie Teaser

టీజర్ మొత్తం సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నింపేశారు. మాధవన్ ఈ చిత్రంలో అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక అనుష్క మూగ అమ్మాయిగా కనిపించబోతుంది. వెకేషన్ కోసం వెళ్ళిన ఓ జంట.. వారు గడుపుతున్న ఇంట్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అవి వీరి ప్రాణాల మీదకు రావడంతో అక్కడి ఇంటర్ పోల్ ఆఫీసర్ లు రంగంలోకి దిగుతారు. అసలు వీరి పై దాడి చేసింది ఎవరు? దెయ్యమా లేక ఓ సైకోనా? అనేది కథ అని తెలుస్తుంది. షాన్లీ డియో అందించిన సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాల రేంజ్లో ఉంది. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ హైలెట్ అని చెప్పొచు. టీజర్ అయితే సినిమా పై మరింత అంచనాల్ని పెంచేలా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.