‘నిశ్శబ్దం’ తరువాత ఆ ప్లాప్ హీరో సినిమాలో నటించబోతున్న అనుష్క ?

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చెయ్యాలి అనుకున్నారు.. కానీ లాక్ డౌన్ వల్ల అది కుదర్లేదు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కోన వెంకట్, విశ్వనాథ్ లు కలిసి నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓటిటి లో డైరెక్ట్ గా ‘నిశ్శబ్దం’ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగినా.. అది ఫేక్ అని నిర్మాతలు తేల్చేసారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తరువాత అనుష్క ఏ చిత్రం చేస్తుంది? మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందా? లేక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా? అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది. అయితే అనుష్క మాత్రం ఓ ప్లాప్ హీరో సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట. ఆ ప్లాప్ హీరో మరెవరో కాదు.. మన గోపీచంద్. ‘శౌర్యం’ వంటి హిట్ తర్వాత.. ‘జిల్’ ‘సౌఖ్యం’ ‘ఆక్సిజన్’ ‘గౌతమ్ నంద’ ‘పంతం’ ‘చాణక్య’ వంటి అరడజన్ సినిమాలు చేసినా హిట్ అందుకోలేకపోయాడు.

Anushka Shetty reveals why she is out from Saaho Movie1

ఇప్పుడు సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటిమార్’ చిత్రం చేస్తున్న గోపీచంద్.. ఆ తరువాత తేజ డైరెక్షన్లో ‘అలివేలు మంగ వెంకట రమణ’ అనే చిత్రం చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క ను సంప్రదించారట. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉన్న కథ కాబట్టి ఆమె కూడా ఓకే చెప్పేసిందట. గతంలో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి చిత్రాల్లో గోపీచంద్, అనుష్క నటించారు. కాబట్టి వీరిది హిట్ ట్రాక్ రికార్డే..! ఈ చిత్రంలో అనుష్క తో పాటు మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట. ఆ పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.