నిశ్శబ్దం ట్రైలర్ రివ్యూ!

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం నిశ్శబ్దం. హీరో మాధవన్, అంజలి, షాలిని పాండే కీలక పాత్రలలో నటించడం జరిగింది. పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో చిత్రం విడుదల కానుంది. 2018లో వచ్చిన భాగమతి చిత్రం తరువాత అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు నిర్మాతలు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి అమెజాన్ ప్రైమ్ కు అమ్మివేయడం జరిగింది.

అక్టోబర్ 2నుండి నిశ్శబ్దం ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో నేడు మూవీ ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. గొప్ప పెయింటర్ అయిన అనుష్క ఓ అరుదైన పెయింటింగ్ కోసం మాధవన్ తో కలిసి ఓ దెయ్యాల కొంపకు వెళుతుంది. అక్కడ వారికి ఎదురైన భయానక అనుభవాల వెనుక ఎవరు ఉన్నారనేది ఈ మూవీ ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. ప్రశాంతగా సాగిపోతున్న అనుష్క జీవితం ఆ ఇంటిలోకి వెళ్ళిన నాటి నుండి ఒడిడుకులు లోనవుతున్నట్లు తెలుస్తుంది.

Anushka Nishabdham Movie Trailer Review1

ఈ మూవీలో అనుష్క స్నేహితురాలు పాత్ర చేసిన షాలిని కూడా చాలా కీలకం అనిపిస్తుంది. ఆమె మిస్సింగ్ మిస్టరీ ఏమిటనేది మరో ఆసక్తికర అంశం. ఇక హీరోయిన్ అంజలి లేడీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మ్యుజీషియన్ అయిన మాధవన్ పాత్ర కొంచెం అనుమానాస్పదంగా ఉంది. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కూడా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేదిగా ఉంది. టి జి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కించారు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Share.