చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడిచినా.. అనుష్క ఇంకా మర్చిపోలేదు?

అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ డైరెక్షన్లో ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో అనుష్క అంటే ప్రతీ ఒక్కరికి ఓ ప్రత్యేక అభిమానం ఉంది. ‘డౌన్ టు ఎర్త్’ అనే క్యారెక్టర్ అనుష్కది అనడంలో సందేహం లేదు. వివాదాలకు దూరంగా ఉండటం అనుష్క కి ఉన్న గొప్ప లక్షణం. అలాంటి అనుష్క మరోసారి అందరి మనసు దోచేసింది. సరిగ్గా ఏడేళ్ళ క్రితం వరకూ తన దగ్గర అసిస్టెంట్ గా హఠాన్మరణమ్ చెందాడు రవి. ఇప్పుడు తనని గుర్తుచేసుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టింది.

anushka-shetty-gets-emotional-1

ఈ పోస్ట్ ద్వారా అనుష్క స్పందిస్తూ.. “మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో , వారు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం . గత 14 సంవత్సరాలు చాలా ప్రయాణం సాగింది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇక మీ జీవితంలో భాగం కాదు అని తెలిసినప్పుడు, వారి జ్ఞాపకాలు మనకి దూరమైనప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ఎలాంటి జీవితం ఉంటుందనే విషయం నాకు తెలియదు. కాని నువ్వు ఎప్పుడు నా హృదయంలో నిలిచి ఉంటావు” అంటూ అనుష్క ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ అనుష్క ను తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share.