ప్రభాస్ ‘సాహో’ పై సంచలన కామెంట్లు చేసిన అనుష్క..!

‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈ చిత్రాన్ని సుమారు రెండు సంవత్సరాల పాటూ చిత్రీకరించారు. ‘బాహుబలి’తో ప్రభాస్‌కు ఇండియా వైడ్ క్రేజ్ ఏర్పడింది కాబట్టి ‘సాహో’ చిత్రాన్ని కూడా నాలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నిన్న ఓ పోస్టర్ ద్వారా ‘సాహో’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ప్రభాస్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు.

Anushka, Saaho Movie, Prabhas

ఇక ఈ పోస్టర్ పై ‘బాహుబలి హీరోయిన్‌’ మరియు ప్రభాస్ కు అత్యంత సన్నిహితురాలైన అనుష్క శెట్టి స్పందించింది. అనుష్క స్పందిస్తూ… ‘ ‘సాహో’ చిత్రం నుండీ వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌, ‘యూవీ క్రియేషన్స్‌’, దర్శకుడు సుజిత్‌కు.. అలాగే ఈ చిత్రంలోని భాగస్తులందరికీ ఆల్‌ ది బెస్ట్‌..’ అంటూ అనుష్క పేర్కొంది. ‘యూవీ క్రియేషన్స్’ వారితో కూడా అనుష్క కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరు నిర్మించిన ‘మిర్చి’ ‘భాగమతి’ చిత్రాల్లో కూడా అనుష్క నటించింది.

Share.