డైరెక్టర్ కూతురిపై దారుణమైన ట్రోలింగ్!

బాలీవుడ్ లో పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అతడి మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురు అలియా కశ్యప్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇటీవల అలియా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ అందులో తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. లోదుస్తులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతమైన ట్రోలింగ్ కు గురైనట్లు చెప్పింది అలియా.

ఆ ట్రోలింగ్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించింది. తనను వేశ్యగా సంబోధిస్తూ.. రేప్ చేసి, చంపేస్తామంటూ బెదిరించిన విషయాలను బయటపెట్టింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వలన తను ఎంత సెన్సిటివ్ అనే విషయం తనకు అర్థమైందని..చిన్న వ్యక్తిరేకత కూడా ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నానని వెల్లడించింది. తనొక ఇండియన్ కావడం వలన.. అలాంటి ఫోటోలు పోస్ట్ చేయడానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారని.. చాలా మంది రేప్ చేస్తామని హెచ్చరించిన విషయాన్ని చెప్పుకొచ్చింది.

కొందరు తనను వేశ్య అని పిలుస్తూ.. రేటు ఎంత అని అడుగుతున్నారని.. చంపేస్తామని బెదిరించారని గుర్తుచేసుకుంది. ఇదంతా కేవలం ఆ ఫోటోలు పోస్ట్ చేయడం వలనే జరిగిందని చెప్పింది. ఈ ట్రోలింగ్ కారణంగా చాలా బాధపడ్డానని.. మానసికంగా ఎంతో కుంగిపోయాయని తెలిపింది. కానీ ఆ తరువాత ఇలాంటి కామెంట్స్ పనిలేని వాళ్లే చేస్తుంటారని.. రియలైజ్ అయ్యి.. అలాంటి వారిని బ్లాక్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Share.