కార్తికేయ 2 లో రాక్షసుడు హీరోయిన్..?

గత ఏడాది నిఖిల్ అర్జున్ సురవరం తో హిట్ అందుకున్నాడు. చాలా కాలం విడుదలకు నోచుకోకుండా పెద్ద యుద్ధం తరువాత విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ యంగ్ హీరో వరుసగా మూడు చిత్రాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.వీటిలో కార్తికేయ 2 అనే క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఓ నూతన అంశం టచ్ చేస్తూ, సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కార్తికేయతో దర్శకుడు చందూ మొండేటికి మంచి పేరొచ్చింది.

anupama parameswaran nikhil siddharth

కాగా ఇదే కాంబినేషన్ లో కార్తికేయ 2 రానుంది. ఇటీవలే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకునే యోచనలో చిత్ర యూనిట్ ఉందట. పాత్ర రీత్యా అనుపమ పరమేశ్వరన్ సరిపోతుందని వారు భావిస్తున్నారట. కార్తికేయ 2లో అనుమప దాదాపు ఖరారు ఐనట్లు తెలుస్తుంది. గత ఏడాది అనుపమ రాక్షసుడు చిత్రంలో సాయి శ్రీనివాస్ కి జంటగా నటించగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక కార్తికేయ 2 చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.