ఇండస్ట్రీ వ్యక్తితో అను ఇమ్మాన్యుల్ పెళ్లి అంటూ గుసగుసలు

ఒక హీరోయిన్ కెరీర్ ఎలా ఉండకూడదు అనేందుకు మంచి ఉదాహరణ అను ఇమ్మాన్యూల్ కెరీర్. నాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకొనే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. “అజ్ఞాతవాసి” సినిమా రిలీజ్ కి ముందు ఆమె లైన్ అప్ చూసినవాళ్లందరూ షాక్ అయ్యారు. ఇక ఆమె తోటి హీరోయిన్స్ అందరూ ఆమె కెరీర్ గ్రాఫ్ చూసి కుళ్ళుకున్నారు. అలాంటిది “అజ్ఞాతవాసి, నా పేరు సూర్య” రిజల్ట్స్ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా తిరగబడింది.

దాంతో హీరోయిన్ రోల్స్ తగ్గిపోయాయి. లైమ్ లైట్ లో ఉండడం కోసం స్పెషల్ రోల్స్ కూడా చేసేసింది. “గీతా గోవిందం”లో ఆమెది చిన్న పాత్రే అయినా ఆమెకు సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లో మళ్ళీ కనిపించలేదు. మధ్యలో తమిళంలో కొన్ని సినిమాలు సైన్ చేసినప్పటికీ అవెందుకో వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత సైన్ చేసిన కొన్ని సినిమాల నుంచి ఆమెను వరుస పరాజయాల కారణంగా తప్పించారు. దాంతో చిన్న చిన్న సినిమాలు కూడా సైన్ చేసింది. ఆఖరికి బెల్లంకొండ సినిమాలో సెకండ్ హీరోయిన్, అది కూడా సోను సూద్ ను పెళ్లాడే రోల్ కూడా చేసేసింది అను ఇమ్మాన్యూల్.

అది కూడా ఆమెకు పెద్దగా వర్కవుటవ్వలేదు. అందుకే “అల్లుడు అదుర్స్” తర్వాత ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే.. ఆమె మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అను ఇమ్మాన్యూల్ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతొందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో నిజం ఎంత అనే విషయం ఎవరికీ తెలియదు కానీ.. కెరీర్ కష్టకాలంలో ఉన్న హీరోయిన్ ఇలా పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు రావడం మాత్రం ఆమె కెరీర్ కు కొత్త తలపోట్లు తీసుకురావడం ఖాయం. మరి అను ఇందుకు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తుందో చూడాలి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.