కోలీవుడ్ దర్శకుడితో అను ఇమ్మాన్యుయేల్ ఎఫైర్ !

‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ ఆరంభంలో ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎక్కువ కాలం రాణించలేకపోయింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసినా.. ఈమె కెరీర్ కి ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో సరైన సినిమాలు కూడా లేవు.

ఇదిలా ఉండగా.. చాలా కాలంగా ఈ బ్యూటీ ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో పలు సినిమాలను రూపొందించిన దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ 2017లో తెలుగులో ‘ఆక్సిజన్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో అను హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని చెబుతున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు. నిజానికి జ్యోతికృష్ణకి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.

కానీ ఇప్పుడు తన భార్యతో కలిసి ఉంటున్నట్లు లేడు. ఈ క్రమంలో అను ఇమ్మాన్యుయేల్ తో ఎఫైర్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి వీరి బంధంపై ఈ జంట ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇటీవల ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కనిపించింది అను ఇమ్మాన్యుయేల్. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తోన్న ‘మహా సముద్రం’ సినిమాలో నటిస్తోంది. కనీసం ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.