ANR, Murali Mohan: ఏఎన్నార్ సలహాలు వింటే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు తెలుగు, తమిళ భాషల సినిమాల్లో 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఏఎన్నార్ సినీ రంగానికి చేసిన కృషికి పద్మ విభూషణ్ తో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. కృష్ణాజిల్లాలోని రామాపురం ఏఎన్నార్ స్వస్థలం. చిన్నప్పటి నుంచే నాటకాలపై విపరీతమైన ఆసక్తిని కలిగి ఉన్న ఏఎన్నార్ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడం గమనార్హం. ప్రముఖ నటుడు మురళీమోహన్ తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను ఒక సందర్భంలో ఏఎన్నార్ ఇంటికి వెళ్లానని ఆ సమయంలో రాత్రి పూట నువ్వేం తీసుకుంటావ్ అని ఏఎన్నార్ ప్రశ్నించారని మురళీమోహన్ తెలిపారు. తాను ఏం తీసుకోనని మందు అలవాటు లేదని ఏఎన్నార్ కు సమాధానం ఇచ్చానని మురళీమోహన్ పేర్కొన్నారు. ఆ తరువాత ఏఎన్నార్ నాకు నిద్ర ఎలా పడుతుందని అనుమానంగా అడగగా పడుకోగానే నిద్రపోతానని తాను సమాధానమిచ్చానని మురళీమోహన్ అన్నారు. ఆ తరువాత ఏఎన్నార్ అరవై సంవత్సరాల తరువాత నడుము మెత్తబడుతుందని ఉత్తేజం రావాలంటే రోజుకు రెండు పెగ్గులు తీసుకోవాలని చెప్పారని మురళీమోహన్ వెల్లడించారు.

మంచి ఫారిన్ బ్రాండ్ వాడాలని ఏఎన్నార్ సూచించారని మురళీమోహన్ పేర్కొన్నారు. మురళీమోహన్ తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ ఇసుక అమ్ముకొని కోట్లు సంపాదించానని జరిగిన ప్రచారంలో నిజం లేదని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ వల్ల రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 18 ఎకరాల భూమిని పోగొట్టుకున్నానని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Share.